సికింద్రాబాద్ గాంధీ దవాఖాన పోస్టులకు గట్టి పోటీ

సికింద్రాబాద్ గాంధీ దవాఖాన పోస్టులకు గట్టి పోటీ

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, దవాఖానల్లో కొంతకాలంగా ఖాళీ ఉన్న పోస్టులకు గట్టి పోటీ కనిపిస్తున్నది.160 వైద్య పోస్టుల భర్తీకి 747 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది ఆన్​లైన్​లో ఒకేపోస్టుకు రెండు సార్లు దరఖాస్తు చేసుకోగా, అధికారులు ఒకటి మాత్రమే పరిగణనలోకి తీసుకుని రెండో దాన్ని తొలగించారు. ప్రొఫెసర్​పోస్టులకు ఎటువంటి పోటీ లేకపోవడం గమనార్హం. బయోకెమిస్ట్రీకి ఒకే దరఖాస్తు రాగా, మైక్రోబయోలజీకి ఒక్కటి కూడా రాలేదు. 

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఇటీవల జరిగిన బదిలీలు, పదోన్నతులతో ఖాళీలు ఏర్పడగా, ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది. దరఖాస్తుల పరిశీలన, మెరిట్ లిస్ట్, అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఆగస్టు 4న అర్హులకు అపాయింట్​మెంట్ లెటర్లు జారీ చేయనున్నారు.