పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి ఆవరణలోని పెషీ కేఫ్‌ను కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఆస్పత్రి అధికారులు సీజ్‌చేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో గాంధీ హాస్పిటల్‌డెవలప్‌మెంట్‌సొసైటీ (హెచ్‌డీఎస్) తరఫున అధికారులు కేఫ్ లోని సామాన్లు బయటకు తీయించి తాళం వేశారు. ఓపీ బ్లాక్‌ఎదురుగా ఉన్న ఈ కేఫ్‌కాంట్రాక్టు గడువు 2018లో ముగిసినప్పటికీ, యాజమాన్యం కోర్టును ఆశ్రయించి ఇంకా కొనసాగిస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు హెచ్‌డీఎస్‌పక్షాన తీర్పు ఇవ్వడంతో అధికారులు చర్యలు చేపట్టారు. సూపరింటెండెంట్‌ప్రొఫెసర్‌వాణి, ఆర్‌ఎంఓ శేషాద్రి, ఏడీ ఫ్లోరెన్స్‌మెర్లిన్‌సమక్షంలో సీజ్ చేశారు. పెషీ కేఫ్ లో అపరిశుభ్ర దుస్టితిలో నాణ్యత లేని పదార్థాలు తయారు చేస్తున్నట్టుఆరోపణలు కూడా గతంలో వచ్చాయి.
