
పద్మారావునగర్, వెలుగు: భారత్, పాకిస్తాన్మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో సికింద్రాబాద్‌గాంధీ హస్పిటల్, గాంధీ మెడికల్‌కాలేజీల భవనాలపై శనివారం రెడ్క్రాస్సింబల్స్ఏర్పాటు చేశారు. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ సమయంలో ఆస్పత్రులపై దాడులకు పాల్పడకూడదనే నిబంధన ఉంది.
ఆసుపత్రుల భవనాలను గుర్తించేలా ఇలా టెర్రస్‌పైన రెడ్క్రాస్సింబల్స్ఏర్పాటు చేస్తారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం, ఎమర్జెన్సీ, ఓపీ విభాగం, మెడికల్‌కాలేజీ భవనాలపై రెడ్క్రాస్సింబల్స్ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.