హైదరాబాద్ లో 38.9 కిలోల గంజాయి పట్టివేత.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో 38.9 కిలోల గంజాయి పట్టివేత.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

పద్మారావునగర్, వెలుగు: నగరంలో అక్రమంగా గంజాయి సప్లై చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను గాంధీనగర్ పోలీసులు అరెస్ట్​చేశారు. పక్కా సమాచారంతో శుక్రవారం సాయంత్రం న్యూ బోయిగూడలో తనిఖీలు చేపట్టి, 38.9 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై మౌనిక తెలిపారు. ముంబైకి చెందిన విజయలక్ష్మి కలియమూర్తి పిళ్లై, సంతోష్ బలరామ్ ప్రజాపతి, సిల్మినా కుజుర్, షీలా దేవి, థానేకు చెందిన రాజారామ్ స్వామి కన్ను పడయాచిలను అరెస్ట్ చేశామన్నారు. కేసు నమోదు చేసి, లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.