గణేష్​ నిమజ్జనం .. బేబీపాండ్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసిన అధికారులు

గణేష్​ నిమజ్జనం .. బేబీపాండ్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసిన అధికారులు
  • రద్దీని తగ్గించడానికి  అధికారుల ప్రణాళిక
  • చిన్న విగ్రహాలను  స్థానికంగానే  నిమజ్జనం చేయాలని అధికారుల సూచన

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో గణేష్​ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు, శాంతి భద్రతలకు భంగం కలగకుండా వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న నీటి కొలనులను (బేబీ పాండ్స్​)ను అధికారులు ఏర్పాటు చేశారు.  అందరూ ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌కే రాకుండా తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బేబీపాండ్స్‌‌‌‌‌‌‌‌లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని అధికారులు సూచించారు.  జీహెచ్ఎంసీ  పరిధిలోని ఆయా జోన్ల పరిధిలో బేబీ పాండ్స్​ సిద్ధం చేసినట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్​ జోన్​ పరిధిలో ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌4 ప్రాంతాల్లోనూ, చార్మినార్​ జోన్​ పరిధిలోని ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌5 ప్రాంతాల్లో,  ఖైరతాబాద్​ జోన్​ పరిధిలోని  6 ప్రాంతాల్లో,  శేరిలింగంపల్లి జోన్​ పరిధిలో 3 ప్రాంతాల్లో, కూకట్​పల్లి జోన్​ పరిధిలో 2 ప్రాంతాల్లో, సికింద్రాబాద్​ జోన్​ పరిధిలో3 ప్రాంతాల్లో బేబీ పాండ్స్​ ఏర్పాటు చేశారు.  కొన్ని ప్రాంతాల్లో బేబీ పాండ్స్​తో పాటు, పోర్టబుల్​ వాటర్​ ట్యాంక్స్‌‌‌‌‌‌‌‌, తాత్కాలికంగా గుంతలు తవ్వి నీటి కొలనులుగా  రూపొందించినట్టుఅధికారులు తెలిపారు.