ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టు రట్టు

ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టు రట్టు

నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఈ ముఠా దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో నకిలీ సర్టిఫికెట్లను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీ మహేష్ భగవత్ కేసు వివరాలను వెల్లడించారు. ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. అందులో భాగంగా జంగ దయాకర్ రెడ్డిని పట్టుకున్నామని చెప్పారు. నాచారానికి చెందిన జంగ దయాకర్ 11 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడని...అతనికి అమెరికా వెళ్లాలని కోరిక ఉండేదని తెలిపారు. యూఎస్ఏ లో ఉన్న ముద్దం స్వామి అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో లక్ష 50 వేలు పెట్టి ఫేక్ సర్టిఫికేట్స్ పొందాడన్నారు.

అయితే దయాకర్ రెడ్డి ఫేక్ సర్టిఫికెట్ పొంది అమెరికా పోవాలని ప్లాన్ చేశాడని.. అందుకే స్వామిని అప్రోచ్ అయ్యాడని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. గతంలో  లివీస్ డేటన్ యూనివర్సిటీ, యూఎస్ మాస్టర్ బిజినెస్ అనాలిటిక్స్ అడ్మిషన్ కోసం దయాకర్ అప్లై చేశాడన్న సీపీ... కానీ ఆ ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయ్యాడని చెప్పారు. స్వామి దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ ఫేక్ సర్టిఫికెట్ కొన్నాడని... స్వామి ఇంకా ఎంత మందికి ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చాడనేది విచారణ చేస్తున్నామని రాచకొండ సీపీ స్పష్టం చేశారు.