ల్యాప్​టాప్​ల దొంగల ముఠా అరెస్ట్

ల్యాప్​టాప్​ల దొంగల ముఠా అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్​పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ల్యాప్​టాప్​లు, స్మార్ట్​ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చోరీ చేస్తున్న తమిళనాడుకు చెందిన నలుగురిని మాదాపూర్​సీపీఎస్, కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్​ చేశారు. శనివారం బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు తన ఆఫీసులో ప్రెస్​మీట్​పెట్టి వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని వేళ్లూరుకు వడివేలు(27), సత్యరాజ్(20) కూలీలు. మరియప్పన్​ అన్నియప్పన్(28) డ్రైవర్, సత్తివేలు(23) వంటమాస్టర్. వీరంతా సంపాదన సరిపోక, ఈజీ మనీ కోసం గ్యాంగ్​గా ఏర్పడి చోరీలకు ప్లాన్​ చేశారు. నలుగురు సిటీకొచ్చి పటాన్​చెరు ప్రాంతంలో ఓ రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

తాము అనాథలమని ప్రచారం చేసుకుంటూ.. చెవిటి, మూగ వారిగా నటిస్తూ.. హాస్టళ్లు, హోటళ్లు, బ్యాచిలర్ల రూమ్స్ వద్దకు వెళ్లేవారు. ల్యాప్​టాప్​లు, ఎలక్ట్రానిక్​పరికరాలు గుర్తించి అదును చూసి దొంగిలించేవారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో105 దొంగతనాలు చేశారు. విశ్వసనీయ సమాచారంతో శనివారం పటాన్​చెరులోని వారి రూమ్ పై కేపీహెచ్​బీ పోలీసులు దాడిచేసి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.5 లక్షలు, 3 ల్యాప్​టాప్​లు, 2 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.