NIA కస్టడీలో గ్యాంగ్‌స్టర్.. అన్మోల్ బిష్ణోయ్ కి 11 రోజుల రిమాండ్

NIA కస్టడీలో గ్యాంగ్‌స్టర్.. అన్మోల్ బిష్ణోయ్  కి 11 రోజుల రిమాండ్

గ్యాంగ్​స్టర్​ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కస్టడీకి అప్పగించింది ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు. NIA 15 రోజుల కస్టడీ కోరగా 11 రోజుల కస్టడీని మంజూరు చేసింది కోర్టు. కస్టడీ ముగిసన తర్వాత నవంబర్ 29న అన్మోల్​ ను మళ్లీ కోర్టులో హాజరు పర్చనున్నారు.  అన్మోల్​ BKI గ్యాంగ్‌స్టర్ సిండికేట్‌లో కీలక సభ్యుడు,  ఖలిస్తానీవేర్పాటు వాదంతో ఉన్న సంబంధాలపై విచారణ జరుగుతుందని ఎన్ ఐఏ తెలిపింది. 

అమెరికాలో బిష్ణోయ్​ బహిష్కరణ తర్వాత ఇండియా వచ్చిన వెంటనే ఢిల్లీ  ఎయిర్​ పోర్టులో ఎన్ ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ హత్య, పంజాబీ సింగర్​ సిద్ధూ మూసేవాలా హత్య పాటు పలు కేసుల్లో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. నెట్‌వర్క్ ఆపరేషన్, నిధులు ఎలా వస్తున్నాయి.. వివిధ కేసుల్లో కుట్రకోణం వంటి విషయాల పై విచారించేందుకు NIA అన్మోల్​ బిష్ణోయ్​ ని కస్టడీని కోరింది.