గోల్డీ బ్రార్ ను టెర్రరిస్ట్​గా ప్రకటించిన కేంద్రం

గోల్డీ బ్రార్ ను టెర్రరిస్ట్​గా ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ :  కెనడాలో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద  కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టుగా ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పంజాబ్​కు చెందిన ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా మర్డర్​తో గోల్డీ బ్రార్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే అంతకు ముందే అతనిపై చాలా కేసులు ఉన్నాయి. 

రాపర్ హనీసింగ్‌ నుంచి రూ.50 లక్షల అక్రమ వసూళ్లు, పాకిస్థాన్‌ నుంచి ఇండియాకు వెపన్స్ స్మగ్లింగ్, హత్యలు, హత్యాయత్నాలు సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గోల్డీ బ్రార్ అసలు పేరు సత్వీందర్ సింగ్. పంజాబ్‌లోని శ్రీముకర్తసర్ సాహిబ్‌లో 1994లో పుట్టాడు. చిన్నప్పుడే నేరాలకు అలవాటు పడిన అతను స్టూడెంట్ వీసాపై కెనడాకు వెళ్లాడు. అక్కడి నుంచి నిషేధిత ఖలిస్థానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో కలిసి ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. వేర్పాటువాదా న్ని సోషల్ మీడియా ద్వారా ప్రేరేపించడం, ఇండియాలో బెదిరింపులు, వసూళ్లు, హత్యలకు పాల్పడుతున్నాడు. అతనిపై రెడ్-కార్నర్ నోటీసు కూడా జారీ అయింది.