ద్రవిడ్ గొప్ప కోచ్ అవుతాడు

ద్రవిడ్ గొప్ప కోచ్ అవుతాడు

కోల్‌‌‌‌కతా: టీమిండియాకు సక్సెస్ ఫుల్ కోచ్ అయ్యేందుకు రాహుల్ ద్రవిడ్ కు అన్ని లక్షణాలు ఉన్నాయని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. అతడి సూక్ష్మ పరిశీలన, వృత్తిపరమైన వైఖరి అందుకు కారణమన్నాడు. ‘ద్రవిడ్ క్రికెట్ ఆడే రోజుల్లో వృత్తిపరంగా చాలా శ్రద్ధతో ఉండేవాడు.  కానీ అప్పటికీ ఇప్పటికీ ఒక్క తేడా ఏమిటంటే, ప్రస్తుతం అతడు టీమిండియా తరఫున నంబర్ 3లో బ్యాటింగ్ చేయవలసిన అవసరం లేదు. ప్రపంచంలో మేటి బౌలర్లను ఎదుర్కొవాల్సిన పని లేదు. కోచ్‌‌గా కూడా ద్రవిడ్ నిజాయతీ, ప్రతిభతోనే పని చేస్తాడు. ప్రతి ఒక్కరూ చేసే విధంగా అతడు కూడా తప్పులు చేయొచ్చు. కానీ సరైన పనులు చేయడానికి ప్రయత్నించినంత కాలం మీరు ఇతరులకన్నా ఎక్కువ విజయాల్ని సాధిస్తారు. రవిశాస్త్రి, ద్రవిడ్​ వ్యక్తిత్వాలు వేరు. వాటిని పోల్చి చూడలేం. ’ అని దాదా పేర్కొన్నాడు.