జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బీసీ బాలుర హాస్టల్ సమీపంలో కొంతమంది యువకులు గంజాయి తాగి హల్చల్ చేశారు. యువతిపై దాడి చేసి పరారయ్యారు. స్కూటీపై వచ్చి మున్సిపల్ వాటర్ ట్యాంక్ సమీపంలో గంజాయి తాగిన ముగ్గురు యువకులు.. అక్కడి నుంచి వెళ్లి బాలుర వసతి గృహ సమీపంలోని ఓ ఇంట్లో ఉన్న యువతిపై దాడి చేశారు.
ఆ యువతి గట్టిగా అరవడంతో పరారయ్యారు. రైల్వేస్టేషన్, కేశవాపురం శివారుతో పాటు పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళ కొందరు యువకులు చిత్తుగా గంజాయి తాగి హల్చల్ సృష్టిస్తున్నారు. గతంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిపై దాడి ఘటన మరవకముందే తాజాగా యువతిపై దాడి చేయడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
