బిహార్ నుంచి గంజాయి ట్రాన్స్ పోర్ట్.. షాద్ నగర్ పీఎస్ పరిధిలో 1.7 కిలోల గంజాయి స్వాధీనం

బిహార్ నుంచి గంజాయి ట్రాన్స్ పోర్ట్.. షాద్ నగర్ పీఎస్ పరిధిలో 1.7 కిలోల గంజాయి స్వాధీనం

షాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు: షాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1.7 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఫరూఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ మండలం బూర్గుల చింతగూడ పరిధిలోని బాలాజీ పౌల్ట్రీ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆత్మ మహతో, సుశీల్ కుమార్, ప్రేమ్ రాజ్ అనే ముగ్గురు డైలీ లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. వీరు బిహార్ నుంచి  గంజాయి తెచ్చి  కార్మికులకు విక్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సీఐ బాలరాజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రూ.40 వేల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

పేట్​ బషీరాబాద్​లో ఇద్దరు అరెస్ట్​..

జీడిమెట్ల: వనపర్తి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన అత్తం శ్రీరామ్ (23), అదే జిల్లాలోని నగల్ కడ్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బంగారి రాకేశ్(23) పేట్​ బషీరాబాద్​ పరిధిలోని పద్మానగర్ రింగ్ రోడ్ వద్ద బుధవారం గంజాయి విక్రయిస్తున్నారు. వీరిని పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి 449 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బజార్ లో 1.3 కిలోలు..

ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిటీ: రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న హైదర్ అలీ రజ్వీ(38)ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పురాలోని బడా కబ్రస్థాన్ సమీపంలో గంగానగర్ నాలా వద్ద బుధవారం మధ్యాహ్నం గంజాయి విక్రయిస్తుండగా రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బజార్ సీఐ నేతాజీ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పరిగిలో 1.05 కేజీలు..

పరిగి, వెలుగు: పరిగి మున్సిపల్​ పరిధిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల నుంచి 1.05 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పరిగి ఎక్సైజ్ సీఐ నీరాజ దేవి తెలిపారు. ఫ్యాక్టరీలో బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన నితీశ్​ రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. బిహార్ నుంచి గంజాయి తీసుకువచ్చి ఫ్యాక్టరీలో విక్రయిస్తున్నట్లు తెలియడంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపారు.