గంజాయి ముఠా అరెస్ట్

గంజాయి ముఠా అరెస్ట్
  • మొయినాబాద్ వద్ద ఐదుగురి అరెస్ట్
  • 98 కిలోల సరుకు స్వాధీనం

గండిపేట, వెలుగు: వైజాగ్ నుంచి సిటీ మీదుగా కర్ణాటకలోని బీదర్ కు గంజాయిని తరలిస్తున్న ఐదుగురికి శంషాబాద్ ఎస్ వోటీ, మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాజేంద్రనగర్ డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బీదర్ కు చెందిన ప్రకాశ్ రాథోడ్(24).. తన బంధువు నివార్ధి(27), భానుదాస్ రాథోడ్(28), బీమ్ రావు రాథోడ్(50), రవీంద్ర చౌహన్(40)తో కలిసి గంజాయిని అమ్మేందుకు స్కెచ్ వేశాడు. ఇందుకోసం ప్రకాశ్​ఏపీలోని ఈస్ట్ గోదావరికి చెందిన ప్రసాద్ ను కాంటాక్ట్ అయ్యాడు. ఈ నెల 18న ప్రకాశ్ గ్యాంగ్ ప్రసాద్​తో కలిసి వైజాగ్ వెళ్లింది. 25న వైజాగ్ లో ఓ సప్లయర్ నుంచి 98 కిలోల ఎండు గంజాయిని కొన్నారు. ప్రసాద్ భద్రాచలంలో వెహికల్ దిగి వెళ్లిపోయాడు.

గంజాయి ప్యాకెట్లతో ప్రకాశ్ గ్యాంగ్ అక్కడి నుంచి సిటీ మీదుగా బీదర్ కు బయలుదేరింది. దీని గురించి సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ వోటీ పోలీసులు మొయినాబాద్ మెయిన్ రోడ్డుపై సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. రెండు కార్లలో వస్తున్న ప్రకాశ్ గ్యాంగ్ ను అడ్డుకున్నారు. వారి నుంచి 98 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురికి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరికి గంజాయిని అమ్మిన ప్రసాద్ పరారీలో ఉన్నాడన్నారు.