కరీంనగర్ టౌన్ లో పేలిన గ్యాస్ సిలిండర్..

కరీంనగర్ టౌన్ లో పేలిన గ్యాస్ సిలిండర్..

కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి.  వివరాల్లోకి వెళితే కరీంనగర్ పట్టణంలోని ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లారు. ఇంట్లోని వస్తువులకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. మంటలు మెల్లగా కిచన్ లోని గ్యాస్ సిలిండర్ కు అంటుకోవడంతో ఒక్కసారిగా గ్యాస్ పేలింది. 

దీంతో అక్కడ  పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయంత తెలుసుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.