వరంగల్ గ్రీవెన్స్కు వినతుల వెల్లువ

వరంగల్ గ్రీవెన్స్కు వినతుల వెల్లువ

ములుగు/ జనగామ అర్బన్/  ఖమ్మం టౌన్/ కాశీబుగ్గ/ ఏటూరునాగారం, వెలుగు: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. జనగామ కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​కు 259 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్​ సందీప్​కుమార్​ఝా తెలిపారు. ములుగులో మొత్తం 28 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్​ కలెక్టర్​ సీహెచ్.మహేందర్​జి చెప్పారు. ​

ఖమ్మం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్​ దివాకర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వరంగల్​గ్రీవెన్స్​కు 166 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్​ సత్యశారద పేర్కొన్నారు. కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జిల్లా మార్కెటింగ్​శాఖ ఆఫీసర్​ సురేఖ ఫొటోకు ఆమె ఇతర ఉద్యోగులతో కలిసి నివాళులర్పించారు. ఏటూరునాగారం ఐటీడీఏ ఆఫీస్​లో నిర్వహించిన గిరిజన దర్బార్​కు వివిధ సమస్యలపై 25 వినతులు వచ్చాయని పీవో లెనిన్​ వత్సల్​టొప్పో తెలిపారు.