V6 News

గ్యాస్ సిలిండర్ పేలి కూలర్ షాపు దగ్ధం

గ్యాస్ సిలిండర్ పేలి కూలర్ షాపు దగ్ధం

ఘట్​కేసర్, వెలుగు: గ్యాస్ ​సిలిండర్​ పేలి కూలర్ల షాప్ ​దగ్ధమైందని పోచారం పోలీసులు తెలిపారు. అన్నోజిగూడ ఎన్టీపీసీ ఎక్స్ రోడ్‎లోని లీలా కూలర్స్​ షాప్‎లో మంగళవారం మధ్యాహ్నం యజమాని రాజేశ్ వంట చేస్తున్నాడు. ఆ సమయంలో సిలిండర్ నుంచి గ్యాస్​లీకై మంటలు అంటుకున్నాయి. అతను స్వల్పంగా గాయపడ్డాడు. కాసేపటికే సిలిండర్ పేలిపోయింది. షాప్‎లో మంటలు వ్యాపించడంతో స్థానికులు 100కు సమాచారం అందించారు. ఎస్సై కృష్ణయ్య, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. బాధితుడిని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు పోలీసులు పేర్కొన్నారు.