గట్టు సామర్థ్యం 3 టీఎంసీలకు పెంపు.. ఎస్ఎల్ఎస్సీ ఆమోదం

గట్టు సామర్థ్యం 3 టీఎంసీలకు పెంపు.. ఎస్ఎల్ఎస్సీ ఆమోదం

హైదరాబాద్​, వెలుగు: గట్టు ఎత్తిపోతల కెపాసిటీని పెంచేందుకు స్టేట్​లెవెల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్​సీ) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 1.3 టీఎంసీల సామర్థ్యం ఉన్న గట్టు రిజర్వాయర్​ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచేందుకు ఎస్ఎల్ఎస్​సీ ఓకే చెప్పింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన ఎస్ఎల్ఎస్​సీ మీటింగ్​లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మొత్తం 20 అంశాల ఎజెండాపై సమావేశం నిర్వహించగా.. అందులో సగం వరకు అంశాలపై ఎస్ఎల్ఎస్​సీలో చర్చించారు.10 అంశాలకు ఆమోదం తెలుపగా.. అందులో ఆరు ఎక్స్​టెన్షన్​ఆఫ్​టెండర్స్​, నాలుగు వేరియేషన్​ ఎస్టిమేట్స్ ఉన్నట్టు తెలిసింది. 

దేవాదుల లిఫ్ట్ ​స్కీమ్ ఫేజ్–​3, కాళేశ్వరం ఎలక్ట్రో మెకానికల్​వర్క్స్​ఈవోటీలకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. దీంతో పాటు పాలమూరు రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. ఇక, అంతకుముందు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన 105 పనులపై ఓ అండ్​ఎం కమిటీ మీటింగ్​నిర్వహించారు. అందులో వందకుపైగా పనులకు ఆమోదం తెలిపారు.