నా భవిష్యత్‌‌ను బీసీసీఐ నిర్ణయిస్తుంది: గంభీర్‌‌

నా భవిష్యత్‌‌ను బీసీసీఐ నిర్ణయిస్తుంది: గంభీర్‌‌

గువాహటి: సౌతాఫ్రికా చేతిలో ఓటమి నేపథ్యంలో తన భవిష్యత్‌‌ను బీసీసీఐ నిర్ణయిస్తుందని టీమిండియా చీఫ్‌‌ కోచ్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌ అన్నాడు. అయితే తన పదవీకాలంలో సాధించిన విజయాలనూ గుర్తు పెట్టుకోవాలన్నాడు.

 ‘నా విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలి. ఇండియా క్రికెట్‌‌ ముఖ్యం, నేను కాదని కోచ్‌‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడే చెప్పా. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నా. ప్రజలు విజయాలను చాలా త్వరగా మర్చిపోతారు. ఎందుకంటే ఇంగ్లండ్‌‌లో యువ జట్టుతో ఫలితాలు సాధించిన వ్యక్తిని నేనేనన్న విషయం మర్చిపోయి కివీస్‌‌ చేతిలో వైట్‌‌వాష్‌‌ను గుర్తు పెట్టుకున్నారు. నేను చాంపియన్స్‌‌, ఆసియా ట్రోఫీని కూడా గెలిచిన వ్యక్తిని’ అని గౌతీ గుర్తు చేశాడు.