
KTPSలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన జెన్కో డైరెక్టర్ బాదావత్ లక్ష్మయ్యపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గతంలో KTPSలో CEగా పనిచేసిన లక్ష్మయ్య..60 మంది క్యాజువల్ లేబర్ కు పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండున్నర కోట్లు వసూలు చేశాడు. లక్ష్మయ్యతో పాటు నలుగురు KTPS ఉద్యోగులు, ఓ కాంట్రాక్టర్ కలిసి బాధితులకు ఉద్యోగాల పేరుతో మోసం చేశారు. సంస్థలో పర్మినెంట్ ఉద్యోగులు అవుతారని నమ్మించి బాధితుల నుంచి చెక్కులు, ప్రామిసరీ నోట్లతో పాటు రెండున్నర కోట్లు తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో పాల్వంచ పోలీసులు కేసు పెట్టారు. కార్మికుల నుంచి నకిలీ ఆర్డర్ పత్రాలను సేకరించారు.