మనదేశంలో భారీగా జియో థర్మల్: సీఈఈడబ్ల్యూ రిపోర్ట్ వెల్లడి

మనదేశంలో భారీగా జియో థర్మల్: సీఈఈడబ్ల్యూ రిపోర్ట్ వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: మనదేశంలోని భూగర్భ ఉష్ణ శక్తి (జియో థర్మల్) ద్వారా భారీగా ఇండస్ట్రియల్ ​హీట్​, కూలింగ్, విద్యుత్​ను ఉత్పత్తి చేయవచ్చని ప్రాజెక్ట్  ఇన్నర్‌‌‌‌‌‌‌‌ స్పేస్.. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) వెల్లడించాయి. వీటి స్టడీ ప్రకారం.. ప్రకారం భారత్‌‌‌‌‌‌‌‌లో 11 వేల గిగావాట్ల ఇండస్ట్రియల్ ​హీట్, 1,500 గిగావాట్ల  కూలింగ్, 450 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. 

ఈ శక్తి వినియోగం వల్ల దేశీయ విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది.  లక్షలాది ఉద్యోగాలూ వస్తాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జియోథర్మల్ విస్తరణకు అనువైన ప్రాంతాలుగా గుర్తించారు.