రాష్ట్ర రాజధాని రూపు రేఖలు మారనున్నాయని, హైదరా బాద్ ఇన్నోవేషన్ హబ్ గా తయారు చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతి నిధి బృందం, జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ టీం వే ర్వేరుగా భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం ఇవాళ సీఎంతో భేటీ అయ్యింది.రాష్ట్రంలో ఏడబ్ల్యూఎస్ ఆన్ గోయింగ్ డేటా సెంటర్లు, వాటి విస్తరణపై చర్చించింది. సమావేశానికి ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ హాజరయ్యారు. జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం కూడా సీఎంతో భేటీ అయ్యింది.
హైదరాబాద్లో జీసీసీని ప్రారంభిస్తున్నట్లు సీఎంకు వివరించింది. డ్యుయిష్ బోర్స్ కంపెనీ విస్తరణలో భాగంగా హై దరాబాద్లో జీసీసీని ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి మైకేల్ బృందాన్ని కోరారు. జీసీసీ ఏర్పాటుతో రెండేళ్లలో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని జర్మనీ బృందం వెల్లడించింది. హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్ తయారు చేసేందుకు సహకరించాలని సీఎం కోరారు. జర్మనీ టీచర్లను నియమించి విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ.. జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందన్నారు.
