న్యూఇండియా నిర్మాణంలో జర్మనీ నైపుణ్యం : మోడీ

న్యూఇండియా నిర్మాణంలో జర్మనీ నైపుణ్యం : మోడీ

న్యూ ఇండియాను నిర్మించేందకుు జర్మనీ నైపుణ్యం ఉపయోగపడుతుందన్నారు ప్రధాని మోడీ.  ప్రజాస్వామ్యంపై భారత్-జర్మనీ సంబంధాలు ఆధారపడి ఉన్నాయన్నారు. అందుకే ప్రపంచానికి సంబంధించిన అన్ని మేజర్ అంశాల్లో భారత్-జర్మనీ అభిప్రాయాలు ఒకే రకంగా ఉంటాయని చెప్పారు. ఢిల్లీలో జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మోడీ. తర్వాత భారత్-జర్మనీల మధ్య వివిధ రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్స్, ఎడ్యుకేషన్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారం పెంపుపై రెండు దేశాలు ఫోకస్ చేశాయని మోడీ చెప్పారు. ఎక్స్ పోర్ట్ కంట్రోల్ రిజీమ్స్ లో భారత్ సభ్యత్వానికి మద్దతు పలుకుతున్న జర్మనీకి థ్యాంక్స్ చెప్పారు మోడీ. ఐక్యరాజ్య సమితి, UN సెక్యూరిటీ కౌన్సిల్ లో సంస్కరణల కోసం భారత్-జర్మనీలు పనిచేస్తున్నాయని చెప్పారు.