ప్రతి సంవత్సరం కంటి పరీక్ష చేయించుకోండి: స్పీకర్ గడ్డం ప్రసాద్

ప్రతి సంవత్సరం కంటి పరీక్ష చేయించుకోండి: స్పీకర్ గడ్డం ప్రసాద్

హైదరాబాద్: సమాజంలో ఆహార పంటలలో విషపూరితమైన ఫర్టిలైజర్స్‎లను వాడటం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నరని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల నుండి పెద్ద వయసు వారికి కంటి సంబంధిత సమస్యలు తలెత్తడం ఆందోళనకరమైన విషయమన్నారు.  హైదరాబాద్ హిమాయత్ నగర్‎లో వాసన్ ఐ కేర్ నూతన బ్రాంచ్ ను రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ఛైర్మెన్ నూతి శ్రీకాంత్‎తో కలిసి స్పీకర్ ప్రారభించారు. అత్యాధునికమైన సౌకర్యాలతో ఇలాంటి ఐ కేర్ సెంటర్‎లు హైదరాబాద్ నగరంలో స్థాపించడం సంతోషకరమన్నారు. ప్రతి ఏటా తప్పనిసరిగా ఐ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా స్పీకర్‎కు డాక్టర్స్ ఐ టెస్ట్ చేశారు.