ప్రతి నెలా ఇన్ కమ్ పొందాలని అనుకుంటున్నారా..ఎటువంటి రిస్క్ లేకుండా ఆదాయం పొందే ఆప్షన్ గురించి ఆలోచిస్తున్నారా?..అయితే మీకోసం అద్భుత అవకా శం..డబ్బుతోనే డబ్బు సంపాదించే అద్భుత అవకాశం లభిస్తోంది. సేవింగ్స్ చేసే వారికోసం మంచి రాబడిని అందించే స్కీం లను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. పోస్టాఫీసుల ద్వారా ప్రతి నెలా రూ. 9 వేలకు పైగా పొందొచ్చు. అకౌంట్‌లోకి వచ్చి ఈ డబ్బుల జమ అవుతాయి.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అదుబాటులో ఉంది. దీని ద్వారా ప్రతి నెలా కొంత ఆదాయం పొందొచ్చు. ఈ స్కీంలో మీరు రూ.1000 నుంచి రూ. 9 లక్షల వరకు డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. అదే జాయింట్ అకౌంట్ అయితే రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
పోస్టాఫీస్ స్కీమ్ మెచ్యూరిటీ గడువు ఐదేళ్లు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ పెడితే ఎక్కువ లాభం వస్తుంది.
ఉదాహరణకు మీరు రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. మీకు నెలకు రూ. 3 వేల వరకు వస్తాయి. అదే రూ. 9 లక్షలు పెడితే మీకు నెలకు రూ. 5,550 లభిస్తాయి. అదే రూ. 15 లక్షలు పెడితే మీరు నెలకు రూ. 9,250 వరకు పొందొచ్చు.
సింగిల్ అడల్ట్, జాయింట్ అకౌంట్, పిల్లల పేరుపై గార్డియన్స్, పదేళ్ల వయసు దాటిన పిల్లలు ఈ స్కీమ్‌లో అకౌంట్ తెరవొచ్చు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీ రాబడి నేరుగా పోస్టాఫీస్ అకౌంట్‌లో జమ అవుతుంది. మీరు దాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే అలాగే కొనసాగించొచ్చు.
ఐదేళ్ల టెన్యూర్ అయిపోయిన తర్వాత పోస్టాఫీస్‌కు వెళ్లి అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డిపాజిట్ దారుడు మరణిస్తే.. అప్పుడు అకౌంట్ క్లోజ్ అవుతుంది. నామినీ లేదా కుటుంబ సభ్యులకు మొత్తాన్ని చెల్లిస్తారు.