నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా పబ్లిష్.. 26 వరకు అభ్యంతరాల స్వీకరణ: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా పబ్లిష్.. 26 వరకు అభ్యంతరాల స్వీకరణ: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ‘సర్’ ప్రక్రియలో భాగంగా తుది ఓటర్ల జాబితా పబ్లిష్​గడువును ఈ నెల 30కి పొడిగించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. శనివారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్​లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అభ్యంతరాల స్వీకరణ, నోటీసుల విచారణ గడువును ఈ నెల 26కి పొడిగించినట్లు చెప్పారు. 

హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల కోసం మొత్తం 1,04,349 దరఖాస్తులు అందగా, వీటిలో 89,301 పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు 14,755 అప్లికేషన్లను ఆమోదించి, 293 దరఖాస్తులను తిరస్కరించామని చెప్పారు.