- జూన్ 25 నుంచి వివరాల సేకరణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాబోయే ఎన్నికల కోసం పారదర్శకమైన, కచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో ‘సర్’ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ చాలా కీలకమని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఎన్నికల అడిషనల్ కమిషనర్ చంద్రకళతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎన్నికల అధికారులకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని, జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవెల్ ఏజెంట్లను (బీఎల్‌ఏ) నియమించుకోవాలని సూచించారు. వచ్చే నెల 25 నుంచి దీనికి సంబంధించిన వివరాల సేకరణ ప్రారంభం అవుతుందన్నారు.
తుక్కుగూడలో సెన్సస్ సర్వే పరిశీలన
శంషాబాద్ సర్కిల్ పరిధిలోని తుక్కుగూడలో జరుగుతున్న సెన్సస్ హౌస్ లిస్టింగ్ పనులను ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ హోదాలో కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సెన్సస్, సర్ (ఎస్‌ఐఆర్) కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, ప్రతి ఇంటికీ వెళ్లి కచ్చితమైన, క్రమబద్ధమైన డేటాను సేకరించాలన్నారు. అప్పగించిన పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు.
అయితే, తమ దగ్గర అంత బడ్జెట్ లేదని, అందుకే, వాటర్ ట్యాంక్ లతో నీటి సరఫరా చేయలేకపోతున్నామని జీహెచ్ఎంసి హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కష్టమైనా సోమవారం ఒక ట్యాంకర్‌తో నీటిని తెచ్చి పోశామన్నారు. బోర్లు కూడా ఎండిపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని, తమ వంతు ప్రయత్నంగా మిగిలిన చేపలను కాపాడే ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
