
- ఎస్ఆర్డీపీ, హెచ్సిటీ పనుల ఆలస్యంపై కమిషనర్ సిరీయస్
- ప్రాజెక్ట్ వారీగా టైమ్ లైన్ ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎస్ఆర్ డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రాం)లో భాగంగా చేపట్టిన పనులు నెమ్మదిగా జరుగుతుండడంతో బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇంజినీరింగ్ అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. హెచ్ సిటీ పనుల విషయంలోనూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
జోనల్ కమిషనర్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్లు, ప్లానింగ్, భూ సేకరణ అధికారులతో మంగళవారం బల్దియా హెడ్ ఆఫీస్‌లో కమిషనర్కర్ణన్సమీక్ష నిర్వహించారు. ఎస్ఆర్డీపీ, హెచ్ సిటీ పనుల్లో వేగం పెంచి, వెంటనే పూర్తి చేసేందుకు వీలుగా ప్రాజెక్ట్ వారీగా టైమ్ లైన్ ఇవ్వాలని ఆదేశించారు.
పనులు చేపట్టేందుకు ఫండ్స్కొరత లేకున్నా ఎందుకు ఆలస్యమవుతుందని ప్రశ్నించారు. యుటిలిటీ షిఫ్టింగ్, పెండింగ్ భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం వద్ద ఏమైనా ఇష్యూస్ పెండింగ్ లో ఉంటే తన దృష్టి తీసుకురావాలని, వెంటనే క్లియర్ చేస్తానని చెప్పారు. మెట్రో, రైల్వే అధికారులతో కో ఆర్డినేషన్అవసరమనకుంటే జోనల్ కమిషనర్లకు తెలియజేయాలన్నారు. పనులు జరిగే ప్రదేశాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీసులతో ప్లాన్ చేసుకోవాలన్నారు.
ఇన్-హౌస్ డిజైన్ వింగ్ ఏర్పాటు
హెచ్ సిటీ, ఎస్ఆర్డీపీ ఇతర ప్రాజెక్టుల డిజైన్లు, సాంకేతిక పరిశీలించేందుకు ఇన్-హౌస్ డిజైన్ వింగ్ ఏర్పాటు చేస్తూ మంగళవారం కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ కన్సల్టెంట్లపై ఆధారపడడం తగ్గించేందుకు ఈ వింగ్ఉపయోగపడుతుందన్నారు.
ఎస్ఈ నేతృత్వంలో 10 మందితో కూడిన టీమ్‌లో సీనియర్ ఇంజినీర్లతో పాటు ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీలో చదివిన జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు చోటు కల్పించామన్నారు. ఈ ప్రత్యేక విభాగం పర్యవేక్షక ఇంజినీర్(ప్రాజెక్ట్స్) నేతృత్వంలో ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజినీర్ నియంత్రణలో పని చేస్తుందని చెప్పారు.
జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి , బోర్కడే హేమంత్ సహదేవ్ రావు, హేమంత్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజినీర్ భాస్కర్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, స్పషల్ డిప్యూటీ కలెక్టర్ రాములు నాయక్ పాల్గొన్నారు.