V6 News

తార్నాక అభివృద్ధికి 25 కోట్లు ఇవ్వండి: సీఎంను కోరిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత

తార్నాక అభివృద్ధికి 25 కోట్లు ఇవ్వండి: సీఎంను కోరిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత

తార్నాక,వెలుగు: ఓయూ పరిధిలో 70 సంవత్సరాలుగా తొమ్మిది బస్తీల్లో వేలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బస్తీల్లో నెలకొన్న సమస్యలను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి సీఎంకు వివరించారు. బుధవారం ఓయూను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలివారు. ఈ సందర్భంగా తార్నాక డివిజన్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. 

అభివృద్ధి కోసం రూ.25 కోట్లు ఇవ్వాలని కోరారు. బస్తీ ప్రజలకు శాశ్వత పునరావాసం కల్పించేలా యూనివర్సిటీ పరిధిలోని 20 ఎకరాల భూమిని కేటాయించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. మానికేశ్వరి నగర్ లో 50 పడకల దవాఖాన నిర్మాణానికి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.