హెరిటేజ్ వాక్ నేపథ్యంలో.. 52 కుక్కలను పట్టిన జీహెచ్ఎంసీ డాగ్ క్యాచింగ్ టీమ్

హెరిటేజ్ వాక్ నేపథ్యంలో.. 52 కుక్కలను పట్టిన జీహెచ్ఎంసీ డాగ్ క్యాచింగ్ టీమ్

మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ హెరిటేజ్ వాక్ నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న వీధి కుక్కలను బల్దియా డాగ్ క్యాచింగ్ టీమ్ పట్టుకుంది. మూడు రోజుల్లో 25 కుక్కలను పట్టుకుని డాగ్ షెల్డర్ హోమ్​కి తరలించింది.

వెటర్నరీ అధికారులు వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేశారు. బుధవారం సాయంత్రం కుక్కలను హోమ్ నుంచి వదిలిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే అధికారులు రోజూ ఈ విధంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చార్మినార్​ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రశ్నించారు. వీఐపీల గురించి మాత్రమే ఆలోచిస్తారా? సామాన్య జనాన్ని పట్టించుకోరా అసహనం వ్యక్తం చేశారు.