GHMC ఎల్ఆర్ఎస్​ ఆదాయం రూ.175 కోట్లు

GHMC ఎల్ఆర్ఎస్​ ఆదాయం రూ.175 కోట్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్) ద్వారా జీహెచ్ఎంసీకి రూ.175.53 కోట్ల ఆదాయం వచ్చింది. 2020లో -ఎల్ఆర్ఎస్ కోసం జీహెచ్ఎంసీకి లక్షా8వేల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో సరైన డాక్యుమెంట్లు సమర్పించిన 63,923 మందికి ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు పంపారు.

ఇప్పటి వరకు 25 శాతం రాయితీతో 14,252  మంది రెగ్యులరైజేషన్ ఫీజులు చెల్లించగా, వీరి నుంచి బల్దియాకు మొత్తం రూ.175.53 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ముందుగా ఈ ఏడాది మార్చి చివరి వరకు మాత్రమే గడువు ఇచ్చారు. తర్వాత ఏప్రిల్ నెలాఖరు వరకు పెంచారు. ఆ తరువాత మే 3 వరకు గడువు ఇచ్చారు. మళ్లీ ప్రభుత్వం ఏమైనా గడువు పెంచుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.