
హైదరాబాద్: పోస్ట్మెన్ను తప్పకుండా గేటెడ్ కమ్యూనిటీల్లోకి అనుమతించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సర్క్యులర్ జారీ చేసింది. బల్దియా పరిధిలోని అన్ని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి ఈ సర్క్యులర్ కాపీని పంపింది. పోస్ట్ మెన్లను లిఫ్టుల్లోకి అనుమతించడంతో పాటు వారికి పార్కింగ్ ప్లేస్ కల్పించాలని బల్దియా ఆ సర్క్యులర్లో స్పష్టం చేసింది. పోస్ట్ మెన్లు జీహెచ్ఎంసీ పరిధిలో పోస్టుల డెలివరీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్ట్మెంట్స్లో పోస్ట్ మెన్లను సెక్యూరిటీ గార్డులు లోపలికి అనుమతించడం లేదు. పాస్ పోర్టులు, ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి కీలక డాక్యుమెంట్స్ డెలివరీ చేయడంలో ఇబ్బందులు పడుతున్నామని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది తీసుకెళ్లారు. పోస్ట్ మెన్లను ఆపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు గేటెడ్ కమ్యూనిటీలను, ఆ గేటెడ్ కమ్యూనిటీల సెక్యూరిటీ సిబ్బందిని హెచ్చరించారు.
ALSO READ | హైదరాబాద్లోని కూకట్ పల్లి ఆర్జీవీ లేడీస్ హాస్టల్ ఇంత ఘోరమా..?