
హైదరాబాద్: కూకట్ పల్లిలోని ప్రైవేట్ హాస్టల్స్లో జీహెచ్ఎంసీ అధికారుల తనిఖీలు చేశారు. ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ లేకుండా ఆర్జీవీ లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా హాస్టల్ నిర్వాహకులు పట్టించుకోలేదు. నోటీసులు ఇచ్చిన సమాధానం రాకపోవడంతో హాస్టల్ను సీజ్ చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లారు. హాస్టల్ ఖాళీ చేయాలని తెలపడంతో ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలని హాస్టలర్స్ నిలదీశారు.
లైసెన్స్ లేకుండా నడుస్తుందని గానీ, గతంలో నోటీసులిచ్చిన విషయం గానీ తమకు తెలియదని హాస్టల్లో ఉన్న యువతులు చెప్పారు. తమకు హాస్టల్ ఖాళీ చేయడానికి రెండు రోజుల సమయం ఇవ్వాలని హాస్టల్ లో ఉంటున్న మహిళలు కోరారు. సోమవారం సాయంత్రం లోపు వేరే హాస్టల్స్ చూసుకుని వెళ్ళిపోవాలని, అప్పుడు వచ్చి సీజ్ చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హాస్టలర్స్కు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ALSO READ | న్యాయమంటే శిక్ష పడటమే కాదు.. బాధితులకు భరోసా కల్పించాలె: సీఎం రేవంత్
ఎస్ఆర్నగర్, అమీర్ పేట, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లోని హాస్టళ్లలో వాటర్బోర్డు అధికారులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. కొందరు ఇండ్లను హాస్టళ్లుగా మార్చి, డొమెస్టిక్కనెక్షన్లతోనే నీటిని వాడుతున్నట్లు గుర్తించారు. నీళ్లు సరిపోకపోవడంతో ఆ కనెక్షన్లకు మోటార్లను బిగించి తోడుకోవడం చూసి అధికారులు అవాక్కయ్యారు. కొందరిపై కేసులు నమోదు చేశారు. ఇండ్లలో హాస్టళ్లు నిర్వహిస్తున్న కొందరు నీళ్లు సరిపోక.. రోజుకు మూడు వాటర్ట్యాంకర్లు బుక్చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ సిటీలో కొందరు హాస్టల్ నిర్వాహకులు చేస్తున్న ఘన కార్యాలు అన్నీఇన్నీ కావు.