ఎమరాల్డ్ స్వీట్ షాపులో GHMC అధికారులు తనిఖీ.. 60 కేజీల బెల్లం.. 3 కేజీల జీడిపప్పు స్వాధీనం

ఎమరాల్డ్ స్వీట్ షాపులో  GHMC   అధికారులు తనిఖీ.. 60 కేజీల బెల్లం.. 3 కేజీల జీడిపప్పు స్వాధీనం

హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఎమరాల్డ్స్ స్వీట్ షాపులో  GHMC   అధికారులు తనిఖీలు నిర్వహించారు. మిఠాయిలు తయారు చేసే కిచెన్​ అపరిశుభ్రంగా ఉందని అధికారులు గుర్తించారు.  అంతే కాకుండా స్వీట్స్​ తయారీకి ప్రమాదకరమైన బెల్లం.. నాణ్యత లేని జీడిపప్పు వాడుతున్నారు,  మెడికల్​ సర్టిఫికెట్​ లేని ఫుడ్​ హ్యాండిలర్స్​ ను గుర్తించారు.  అంతే కాకుండా స్వీట్స్​ తయారీకి వాడే ముడి పరుకులపై , వాటర్​ క్యాన్ పై సరైన లేబుల్​ లేదని GHMC   అధికారులు తెలిపారు.   షాపులో నిల్వ ఉన్న  ప్రమాదకరమైన  60 కేజీల బెల్లం... నాణ్యత లేని 3 కిలోల జీడిపప్పును స్వాధీనం చేసుకున్నారు. 

  • Beta
Beta feature