హైదరాబాద్, వెలుగు: గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ (జీఐఏ) హైదరాబాద్ వేదికగా గోల్ఫ్ –టర్ఫ్ సమ్మిట్, ఎక్స్‌పో 12వ ఎడిషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్, కంట్రీ క్లబ్‌లో రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్ శుక్రవారం ముగిసింది. సౌత్ ఇండియాలో తొలిసారిగా నిర్వహించిన ఈ ఈవెంట్‌లో గోల్ఫ్ టూరిజం–- డెస్టినేషన్ ఇండియా, గోల్ఫ్ కోర్సుల నిర్వహణలో నీటి డిమాండ్‌ను తగ్గించడం, నెట్ జీరో వాటర్ అప్రోచ్ వంటి అంశాలపై ప్యానెల్ డిస్కషన్స్‌లో విస్తృతంగా చర్చించారు.
రెయిన్‌బర్డ్‌కు చెందిన అయమాన్ బైటెనె, గంగేష్ రెడ్డి, అమన్‌దీప్ జోల్ (పీజీటీఐ సీఈవో) వంటి ఇంటర్నేషనల్, ఇండియన్ ఎక్స్‌పర్ట్స్ గోల్ఫ్ కోర్సుల భవిష్యత్తు నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఆచరణలో పెట్టగలిగే విషయాలు వివరించారు. గోల్ఫ్ కోర్సులను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి, డిజిటల్ డెవలప్‌మెంట్ సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సెషన్లలో స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. అందరూ కలిసి పనిచేయడం, కొత్త ఆలోచనలు, పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలని ఈ సమ్మిట్ గుర్తు చేసిందని జీఐఏ చైర్ పర్సన్ అనిరుధ్ సియోలేకర్ అన్నారు.
