కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

నాగాలాండ్‌లో జూన్ 4న సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో కొండపై నుంచి భారీ బండరాళ్లు పడి రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. దిమాపూర్, కొహిమా మధ్య చుమౌకెడిమా జిల్లాలోని జాతీయ రహదారి 29పై ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల మధ్య సాయంత్రం 5 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

కోహిమా వైపు నుంచి వస్తున్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసమైన తర్వాత.. మరో భయానక ఘటన చోటుచేసుకుంది. బండరాళ్లలో ఒకటి ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ దృశ్యాలు వెనుక వేచి ఉన్న కారు డాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే ముందు జరిగిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులను తెలిపారు. మరొక వ్యక్తి ఇప్పటికీ కార్లలో ఒకదానిలో చిక్కుకున్నాడు మరియు రెస్క్యూ పనిలో ఉన్నాడు,  

ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని "పాకలా పహార్" అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం తరచుగా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీఫియు రియో ​​ప్రాణనష్టానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు అత్యవసర సేవలు, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక్కో బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.