ఉద్యోగ సంఘాల లీడర్ల చుట్టాలకు నజరానా!

ఉద్యోగ సంఘాల లీడర్ల చుట్టాలకు నజరానా!

టీజీఓ అధ్యక్షురాలు మమత భర్తకు సర్వీస్ పెంపు
టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ రాజేందర్ సమీప బంధువుకూ..
గుట్టుగా సర్కార్ జీవోలు

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగ సంఘాల లీడర్లకు ప్రభుత్వం దొడ్డిదారిన లబ్ధి చేకూరుస్తోంది. సర్కారు ఉద్యోగం చేస్తున్న వాళ్ల బంధువులకు సర్వీస్‌‌పెంచి జీవోలిస్తూ మచ్చిక చేసుకుంటోంది. ఇటీవల టీఎన్జీవో, టీజీవో సంఘాల ముఖ్య నేతల బంధువులిద్దరి సర్వీస్ పెంపు అంశం బయటపడింది. అయితే ఇందుకు సంబంధించిన జీవోలను మాత్రం ప్రభుత్వం వెబ్‌‌సైట్‌‌లో పెట్టకుండా సీక్రెట్‌‌గా ఉంచింది. ఎంప్లాయీస్‌‌రిటైర్‌‌మెంట్‌‌ఏజ్‌‌ను 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతామని 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దీన్ని ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టారు. టీఆర్‌‌ఎస్‌‌రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో ప్రతినెలా వందలాది మంది ఉద్యోగులు రిటైర్ మెంట్‌‌ఏజ్ పెంచుతారేమోనని ఆశగా ఎదురుచూస్తూనే.. రిటైర్​ అవుతున్నారు. జూన్ 2న సీఎం గుడ్ న్యూస్ చెబుతారేమోనని అనుకున్నా.. ఆ రోజూ నిరాశే మిగిలింది.

వినతి పత్రాలతోనే సరి

రిటైర్‌‌మెంట్‌‌ఏజ్​పెంపుసహా పీఆర్సీ, ఐఆర్, బదిలీలపై కొంతకాలంగా ఓ వర్గం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. కానీ రెండు పెద్ద సంఘాలు మాత్రం సర్కారుకు వినతి పత్రాలిచ్చి ఊరుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే టీఎన్జీవో, టీజీవో సంఘాల ముఖ్య నేతల బంధువులిద్దరికీ సర్వీస్ పెంపు అంశం బయటపడింది. ఇది సీఎం ఆయా సంఘాల నేతలకు నజరానా అని ప్రచారం జరుగుతోంది. ప్రతినెలా 500 నుంచి 700 మంది ఉద్యోగులు రిటైర్‌‌అవుతున్నారు. సీఎం హామీ ఇచ్చిన తర్వాత సుమారు 15 వేల మంది వరకు రిటైర్​ అయ్యారు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలోనే రిటైర్మెంట్ ఏజ్‌‌ను పెంచగా, మన రాష్ట్రంలో ఇంకా అమలు కాలేదని ఎంప్లాయీస్ నిరాశ చెందుతున్నారు. ‘యూనియన్ల పెద్ద లీడర్లు పైరవీలు చేసుకొని, వారి బంధువులకు సర్వీస్ పెంపు చేయించుకుంటున్నారు. కానీ మామూలు ఉద్యోగుల గురించి పట్టించుకోవట్లేదు’ అని ఓ యూనియన్  లీడర్ వాపోయారు.

ఇద్దరికి సర్వీస్ పెంపు

హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలోని జీఐఎల్​జీ కాలేజీలో పనిచేస్తున్న సీనియర్ ​లెక్చరర్ వెంకటేశ్వర్లు మే నెలాఖరున రిటైర్‌‌కావాల్సి ఉంది. కానీ ఆయన సర్వీసును రెండేండ్లు పొడిగిస్తూ విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రారాంచంద్రన్ మే 28న జీవో నెంబర్ 89 రిలీజ్‌‌చేశారు. వెంకటేశ్వర్లు టీజీఓ రాష్ట్ర అధ్యక్షురాలు మమత భర్త కావడం గమనార్హం. ఈ ఉత్తర్వుల్లో రిఫరెన్స్ కింద టీజీఓ పేరు కూడా ఉంది.

మేడ్చల్ జిల్లా పరిధిలో ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్‌‌గా పనిచేస్తున్న వెంకటేశం సర్వీస్‌‌నూ రెండేండ్లు పొడిగించింది. ఆయన ఫిబ్రవరి నెలాఖరులో రిటైర్​ కావాల్సి ఉంది. ఆయన సర్వీస్‌‌పెంచుతూ  ఫిబ్రవరి 29న సీఎస్  సోమేశ్​కుమార్ ఉత్తర్వులిచ్చారు. వెంకటేశం టీఎన్‌‌జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ దగ్గరి బంధువు. ఈ ఇద్దరి సర్వీస్​ పెంపు జీవోలను సర్కారు వెబ్‌‌సైట్‌‌లో పెట్టలేదు. కొందరు ప్రజాప్రతినిధుల సిఫార్సులతో చేనేత జౌళిశాఖలో మరో ఇద్దరు అధికారుల సర్వీసును రెండేళ్లు పొడిగించినట్లు ప్రచారం జరుగుతోంది.

For More News..

త్వరలో ఆర్మీలోకి ‘తేజస్ ఎన్’

డిప్రెషన్‌‌లో చిక్కుకుని చావాలనుకున్నా

మారటోరియంలో వడ్డీ వసూలు చేయకూడదు!