న్యూఓర్లీన్స్: కరోనా కష్టకాలంలో పుట్టిన ఒక జిరాఫీ పిల్లకు ‘హోప్’ అని నామకరణం చేశారు. న్యూ ఓర్లీన్స్‌లోని ఆడుబోన్ నేచర్ ఇన్‌స్టిట్యూట్‌లో న్యూ ఎల్లెన్ అనే జిరాఫీ సోమవారం డెలివరీ అయిందని అధికారులు చెప్పారు. ఈ కష్టకాలంలో పుట్టినందుకు పిల్ల జిరాఫీకి ‘హోప్’ అనే పేరు పెట్టామని అధికారులు చెప్పారు. హోప్ ఆరు అడుగుల ఎత్తు, 86 కిలోల బరువు ఉందని అన్నారు. 1200 ఎకరాల్లో డౌన్‌టౌన్ న్యూ ఓర్లీన్స్‌కు పశ్చిమాన ఉన్న ఈ కేంద్రంలో 13 జిరాఫీలు ఉన్నాయి. శాన్‌డిగో జూ గ్లోబల్ , వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ భాగస్వామ్యంలో ఉన్న ఈ కేంద్రంలో పుట్టిన 8వ జిరాఫీ హోప్.
