అమ్మాయి చాలా తెలివైనది.. చిన్నారి ప్రశ్నలపై సీఎం కామెంట్

అమ్మాయి చాలా తెలివైనది.. చిన్నారి ప్రశ్నలపై సీఎం కామెంట్

ముంబైలోని నందనవన్ బంగ్లాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకి ఓ చిన్నారి మధ్య జరిగిన చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నదా దామ్రే అనే అమ్మాయి...షిండేను ముఖ్యమంత్రి ఎలా కావాలి అని సలహా అడగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అస్సాంలో వరదలు వచ్చినపుడు బాధితులను కలుసుకునేందుకు మీరు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లారు. అలా వరద బాధితులకు సహాయం చేస్తే తాను కూడా ముఖ్యమంత్రి కాగలనా అని ఆ చిన్నారి ఏక్ నాథ్ షిండే ను ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ... అవును ఖచ్చితంగా నువ్వు సీఎం అవుతావు. మేము దీనిపై తీర్మానం కూడా చేస్తామని నవ్వుతూ సమాధానమిచ్చారు.

అంతే కాకుండా దీపావళి సెలవులకు తనను గౌహతి తీసుకెళ్తారా ? అని ఆ అమ్మాయి కోరగా.. ఖచ్చితంగా తీసుకెళ్తానని సీఎం బదులిచ్చారు. నువ్వు కామఖాయ ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నావా? అని షిండే అడగ్గానే.. అవునంటూ  చిన్నారి సమాధానమిచ్చింది. ఆ తర్వాత సీఎం ఏక్ నాథ్ షిండే.. తన సిబ్బంది వైపుకి తిరిగి "అమ్మాయి చాలా తెలివైనది" అని వ్యాఖ్యానించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. ఇదిలా ఉండగా షిండే గత నెలలో  ఉద్ధవ్ థాకరేను గద్దె దింపి... సీఎం పదవి చేపట్టాడు.