వనస్థలిపురంలో ఘోర ప్రమాదం.. హైవే పక్కన నడుచుకుంటూ వెళ్తున్న అక్క చెల్లెళ్లను ఢీకొన్న కారు... ఒకరు మృతి..

వనస్థలిపురంలో ఘోర ప్రమాదం.. హైవే పక్కన నడుచుకుంటూ వెళ్తున్న అక్క చెల్లెళ్లను ఢీకొన్న కారు... ఒకరు మృతి..

హైదరాబాద్ వనస్థలిపురంలో ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే సర్వీసులో రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న అక్క చెల్లెళ్లను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

వనస్థలిపురానికి చెందిన అంజలి, పూజిత అనే అక్క చెల్లెళ్లు ఇవాళ సాయంత్రం సర్వీసు రోడ్డు మీద నడుచుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు డీకోట్టింది. ఈ క్రమంలో అంజలి అక్కడికక్కడే మృతి చెందగా పూజితకు తీవ్ర గాయాలయ్యాయి.

►ALSO READ | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు : హనీట్రాప్ అంటూ తిరిగి కేసు ఫైల్

తీవ్రంగా గాయపడ్డ పూజితను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.