కుక్కల నుంచి తప్పించుకున్న బాలిక 

కుక్కల నుంచి తప్పించుకున్న బాలిక 

చిన్నారులపై వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. అయితే బాలిక తృటిలో వాటినుంచి తప్పి్ంచుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడలో చోటుచేసుకుంది.  దారి వెంట వెళ్తున్న చిన్నారిని రెండు కుక్కలు వెంబడించాయి. దీంతో ఆ చిన్నారి వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టింది. చిన్నారిని కుక్కలు కూడా వెంబడించాయి. ఈ క్రమంలో అక్కడికి ఓ వ్యక్తి వచ్చి కుక్కలను రాళ్లతో బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో ఆ చిన్నారి ఊపిరి పిల్చుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమారాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంబర్‌పేట ఘటన తర్వాత జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.  పలు ప్రాంతాల్లో వీధి కుక్కలను బంధించారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టారు. చిన్నారులను వీధుల్లో ఒంటరిగా వదిలేయకూడదని హెచ్చరిస్తున్నారు.