V6 News

ప్రియుడి బర్త్‌ డే గిఫ్ట్ కోసం.. రూ.2 లక్షల వాచ్ కొట్టేసిన ప్రియురాలు

ప్రియుడి బర్త్‌ డే గిఫ్ట్ కోసం.. రూ.2 లక్షల వాచ్ కొట్టేసిన ప్రియురాలు

ప్రియుడి బర్త్ డే కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంది ఓ ప్రియురాలు. అది కాస్ట్లీ గిఫ్ట్ అయితే ఇంకా ఇంప్రెసివ్ గా ఉంటుందని భావించింది. కానీ అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో.. ఒక ప్లాన్ వేసింది. షాపింగ్ చేద్దాం.. ఎవరి కంట పడకుండా నొక్కేద్దాం అనుకుంది. కొట్టేసింది కూడా. కానీ సీసీ కెమెరా అనే మూడో కన్ను ఉంది కదా. అలా దొరికిపోయింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడిన యువతి.. అతనికి ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇవ్వాలనే ఆశతో చోరీకి పాల్పడింది యువతి. బర్త్ డే గిఫ్ట్ కోసం రూ.2 లక్షల విలువైన వాచ్ దొంగతనం చేసి పోలీసులకు చిక్కింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉన్న రమేష్ వాచ్ షాప్ లో వాచ్ ఎత్తుకెళ్లింది యువతి. 

వాచ్ మిస్సైనట్లు గుర్తించిన షాపు యజమాని.. సీసీ టీవీ ఫూటేజ్ చెక్ చేయగా యువతి నొక్కేసినట్లు నిర్ధారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోన్ డేటా ఆధారంగా యువతి  పట్టుబడింది. కేసు  నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు  యువతిని అరెస్ట్ చేశారు.