
తమ పట్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మాదాపూర్ లో ఓ హాస్టల్ యజమానిని చితకబాదారు అమ్మాయిలు. నెల రోజుల పాటు మైనర్ బాలికను వేధిస్తున్నారనే ఆరోపణలతో హాస్టల్ లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు కుటుంబ సభ్యులు. హాస్టల్ నిర్వాహకుడిపై దాడి చేశారు.
మదాపూర్ లో ఇమేజ్ గార్డెన్ రోడ్డులోని అర్ణవ్ ప్లాజాలో ఎన్ పీపీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఓ మైనర్ బాలిక ఉంటుంది. బోరబండకు చెందిన 16 ఏళ్ల అమ్మాయి హాస్టల్ లో ఉంటూ నీట్ ట్రైనింగ్ తీసుకుంటోంది. నెల రోజుల పాటు మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. హాస్టల్ కు వచ్చిన తల్లిదండ్రులు , అమ్మాయిలు కలిసి యజమాని సత్యప్రకాశ్ ను చితకబాదారు. హాస్టల్ అద్దాలు, ఫర్నీచర్, చెట్ల కుండీలు ధ్వంసం చేశారు.
►ALSO READ | చందానగర్ ఖజానా దొంగలు దొరికారు.. 20 రోజులు రెక్కీ చేసి దోపిడికి ప్లాన్
మైనర్ పై లైంగిక దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. అత్యాచారం జరగలేదని, అదంతా అబద్ధమని చెబుతున్నారు హాస్టల్ నిర్వాహకులు. బిల్డింగ్ విషయంలో జరుగుతున్న గొడవలో భాగంగా తనపై దాడి చేశారని చెబుతున్నాడు హాస్టల్ యజమాని . కావాలనే సన్ సిటీ నుంచి గ్యాంగ్ ను తీసుకొచ్చి గొడవ చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. గత మూడు నెలల్లో రెండోసారి తనపై దాడి చేశారని చెబుతున్నాడు యజమాని సత్యప్రకాశ్.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. హాస్టల్ నిర్వాహకుడు సత్యప్రకాశ్ ను పీఎస్ కు తీసుకెళ్లారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక దాడి జరిగిందా? లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.