
హైదరాబాద్ లో ఆగస్టు 12న చందానగర్ లోని ఖజానా జ్యువెలరీ షోరూంలో దోపిడి చేసి కాల్పుల జరిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏడుగురి నిందితులను గుర్తించిన పోలీసులు ఆశిష్ , దీపక్ కుమార్ అనే ఇద్దరిని అరెస్ట్ అరెస్ట్ చేశారు. దోపిడి దొంగలు బీహార్ కి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. నిందితులపై బీహార్ లో కూడా దోపిడి కేసులు ఉన్నట్లు చెప్పారు మాదాపూర్ పోలీసులు.
ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్ .. ఖజానా జ్యువెలరీ దగ్గర దొంగలు 20 రోజులు రెక్కీ నిర్వహించారని చెప్పారు. నిందితులు ఇద్దరిని పూణెలో అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి 900 గ్రాముల వెండి స్వాదీనం చేసుకున్నామన్నారు. వెస్ట్ బెంగాల్ , కోల్ కత్తాలో జ్యూవెలర్స్ షాప్ లలో దోపిడీలు జరిగాయిన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిపై 10 కేసులు ఉన్నట్లు చెప్పారు. ఈ కేసులో 10 కేజీల సిల్వర్ దోపిడీ చేశారని.. 900 గ్రాముల సిల్వర్ రికవరీ చేశామన్నారు. నిందితులు జగద్గిరిగుట్టలో ఉంటూ దోపిడికి ప్లాన్ చేశారని చెప్పారు. జగద్గిరిగుట్టలో అద్దెకు బైక్స్ తీసుకొని వచ్చి దోపిడీ చేశారని తెలిపారు. అదే బైక్స్ పై సిటీ దాటి వెళ్లిపోయారని తెలిపారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
►ALSO READ | 2 రూపాయలకు టీ షర్ట్.. 49 రూపాయలకు షర్ట్ ఏంట్రా: వాళ్లు చెబితే మీరెలా నమ్మార్రా..!
పరారీలో ఉన్న సివాన్ గ్యాంగ్ కోసం గాలిస్తున్నామని తెలిపారు డీసీపీ వినీత్. సివాన్ గ్యాంగ్ మొదటి సారి హైదరాబాద్ లో దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఒక్కసారి దోపిడీ చేసిన తరువాత మరోసారి ఆ ప్రాంతంలో సివాని గ్యాంగ్ దోపిడీ చేయబోదన్నారు. దొరికినంత దోచుకోవడమే సివాన్ గ్యాంగ్ లక్ష్యమని చెప్పారు.