ఇక అమ్మాయిలకూ ఎంట్రీ: సైనిక్ స్కూల్స్ నిబంధనల్లో మార్పు

ఇక అమ్మాయిలకూ ఎంట్రీ: సైనిక్ స్కూల్స్ నిబంధనల్లో మార్పు
  • ఇప్పటి వరకు అబ్బాయిలకే మాత్రమే ప్రవేశం
  • 2021-22 నుంచి అమ్మాయిలకూ అడ్మిషన్స్
  • రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆమోదం

న్యూఢిల్లీ: రక్షణ శాఖ ఆద్వర్యంలో నడిచే సైనిక్ స్కూల్స్ విషయంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి కేవలం అబ్బాయిలకు మాత్రమే ఈ పాఠశాలల్లో ప్రవేశం కల్పించేవారు. ఈ నిబందనలో మార్పు చేస్తూ అమ్మాయిలకు కూడా అడ్మిషన్స్ ఇవ్వాలని కేంద్ర నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి బాలికలకు దేశ వ్యాప్తంగా అన్ని సైనిక్ స్కూల్స్ లో ప్రవేశం కల్పించేలా ఆదేశాలిచ్చారు.

నిర్మలా సీతారామన్ టైంలో తొలి అడుగు

రెండేళ్ల క్రితం నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో ఆడపిల్లలకు సైనిక్ స్కూల్స్ లో ప్రవేశంపో తొలి అడుగు పడింది. ప్రయోగాత్మకంగా మిజోరంలోని ఛింగ్చిప్ సైనిక్ స్కూల్ లో బాలికలకు ప్రవేశం కల్పిస్తూ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు.

తొలి బ్యాచ్ పట్టుదల వ్లలే

సైనిక్స్ స్కూల్స్ లో విద్యార్థులకు కఠినతరమైన దేహదారుడ్య శిక్షణ, ప్రాథమిక ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది. వీటిని తట్టుకుని అమ్మాయిలు ఎటువంటి ఇబ్బందీ లేకుండా నిలబడగలిగితే అన్ని స్కూల్స్ లో అడ్మిషన్స్ ఇవ్వాలని నాడు నిర్ణయించారు. అమ్మాయి దీటుగా నిలబడి రెండేళ్లు తమ విద్యను పూర్తి చేసుకోవడంతో ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. తొలి బ్యాచ్ అమ్మాయిల పట్టుదలతో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడం వల్లే అన్ని సైనిక్ స్కూల్స్ లో అడ్మిషన్లకు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

మిజోరం సైనిక్ స్కూల్ లో తొలి బ్యాచ్ లో కొందరు విద్యార్థినులు