మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ మోత..రెండో టీ20లో ఆస్ట్రేలియా 34 రన్స్‌‌‌‌ తేడాతో వెస్టిండీస్‌‌‌‌పై గెలుపు

మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ మోత..రెండో టీ20లో ఆస్ట్రేలియా 34 రన్స్‌‌‌‌ తేడాతో వెస్టిండీస్‌‌‌‌పై గెలుపు

అడిలైడ్‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌లో గ్లెన్‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (55 బాల్స్‌‌‌‌లో 12 ఫోర్లు, 8 సిక్స్‌‌‌‌లతో 120 నాటౌట్‌‌‌‌) మోత మోగించడంతో.. ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ ఆస్ట్రేలియా 34 రన్స్‌‌‌‌ తేడాతో వెస్టిండీస్‌‌‌‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో మరోటి మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. టాస్‌‌‌‌ ఓడిన ఆసీస్‌‌‌‌ 20 ఓవర్లలో 241/5 స్కోరు చేసింది.

డేవిడ్‌‌‌‌ వార్నర్‌‌‌‌ (22), మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌ (29) ఓ మాదిరిగా ఆడినా మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ కీలక భాగస్వామ్యాలతో రెచ్చిపోయాడు. స్టోయినిస్‌‌‌‌ (16)తో నాలుగో వికెట్‌‌‌‌కు 82 (42 బాల్స్‌‌‌‌), టిమ్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ (31 నాటౌట్‌‌‌‌)తో ఐదో వికెట్‌‌‌‌కు 95 (39 బాల్స్‌‌‌‌) రన్స్‌‌‌‌ జోడించాడు. ఈ క్రమంలో 50 బాల్స్‌‌‌‌లోనే ఐదో సెంచరీ చేసిన మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌.. రోహిత్‌‌‌‌ శర్మ (5) రికార్డును సమం చేశాడు. తర్వాత విండీస్‌‌‌‌ 20 ఓవర్లలో 207/9 స్కోరుకే పరిమితమైంది. రొవ్‌‌‌‌మన్‌‌‌‌ పావెల్‌‌‌‌ (63) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. ఆండ్రీ రసెల్‌‌‌‌ (37), జేసన్‌‌‌‌ హోల్డర్‌‌‌‌ (28 నాటౌట్‌‌‌‌) పోరాడారు. స్టోయినిస్‌‌‌‌ 3 వికెట్లు తీశాడు. మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో టీ20 మంగళవారం పెర్త్‌‌‌‌లో జరుగుతుంది.