ఆర్ఎఫ్సీలో మార్చి 14న గ్లో రన్

ఆర్ఎఫ్సీలో మార్చి 14న గ్లో రన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: రామోజీ ఫిల్మ్ సిటీలో మార్చి14న ‘ గ్లో రన్ ’ నిర్వహించనున్నారు. 3కె, 5 కె, 10 కె రన్ నైట్ చాలెంట్ వంటి మూడు విభాగాల్లో ప్రొఫెషనల్ రన్నర్ల పాల్గొననున్నారు. ఇందులో మొదటి సారి రన్ చేయాలనుకునే వారు కూడా పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్​పద్మశ్రీ దీపికా రెడ్డి, ఇండియన్ ఆర్చర్ జ్యోతి సురేఖ దీనికి సంబంధించిన జెర్సీ ఆవిష్కరించారు. రన్​లో పాల్గొనే వారి కోసం ఎల్ బీనగర్ మెట్రో నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి ప్రత్యేకంగా వెహికల్స్ ఏర్పాటు చేయనున్నారు.