- జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
హైదరాబాద్ సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంపై దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు. దేశంలోని దక్షిణ, ఉత్తర భాగాలను కలుపుతూ దక్షిణ భారతదేశానికి ముఖ ద్వారంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ నిలుస్తోందన్నారు.
గూడూరు నుంచి బల్హర్షా వరకు ఉన్న రైలు మార్గం నిరంతర రైళ్ల రాకపోకలతో ఒక గ్రాండ్ ట్రంక్ మార్గంగా పని చేస్తోందని తెలిపారు. కాజీపేట నుంచి సికింద్రాబాద్ మీదుగా వాడి జంక్షన్ మార్గాన్ని అత్యంత రద్దీ నెట్‌వర్క్‌గా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రద్దీని తగ్గించి, రాకపోకలను సులభతరం చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్పెట్టామని పేర్కొన్నారు. జోన్ 194.57 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను జోడించినట్లు తెలిపారు.
