హైదరాబాద్‌లో కొంతమంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా మేకపోతుల పోటీలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని హకీమ్ బాబా దర్గా ప్రాంతంలో ఈ పోటీలు నడుస్తున్నాయి. సమాచారం మేరకు ఈ పోటీలపై పోలీసులు దాడి చేసి.. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. మల్లిక్, వీర అనే రెండు బలిష్టంగా ఉన్న మేకపోతులను కూడా బంజారాహిల్స్ పీఎస్‌కి తరలించారు. ఈ పోటీలకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 61,800 రూపాయల నగదు సీజ్ చేశారు. ఎస్ఆర్ నగర్‌కి చెందిన ఓ రౌడీషీటర్ ఈ పోటీలు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ రౌడీషీటర్ పరారీలో ఉన్నాడని.. అతన్ని పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
