సినిమా చూశాక ఐ లవ్‌‌‌‌ యూ డాడీ అని చెప్తారు: సుమంత్ ప్రభాస్

సినిమా చూశాక ఐ లవ్‌‌‌‌ యూ డాడీ అని చెప్తారు: సుమంత్ ప్రభాస్

సుమంత్ ప్రభాస్,  నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై అభినవ్ నిర్మించిన చిత్రం ‘గోదారి గట్టుపైన’. జగపతిబాబు,  లైలా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చూశాక మంచి హ్యూమన్ వాల్యూస్  ఉన్న సినిమా చూసిన సంతృప్తిని ఇస్తుంది. 

ముఖ్యంగా తండ్రీ- కూతుళ్ల ఎమోషన్ అందర్నీ ఆకట్టుకుం టుంది. థియేటర్ నుంచి బయటికి రాగానే అమ్మాయిలు ‘ఐ లవ్ యూ డాడీ’  అని తమ ఫాదర్‌‌‌‌కి ఫోన్ చేసి చెప్తారు. అలాంటి అందమైన ఎమోషన్ ఈ సినిమాలో ఉంది’ అని చెప్పాడు. ఈ చిత్రంలో తాను పోషించిన మాయ పాత్రను మర్చిపోలేనని  హీరోయిన్ నిధి ప్రదీప్ చెప్పింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీలో నటించడం సంతోషంగా ఉందని లైలా అన్నారు.  బ్యూటిఫుల్ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నామని  డైరెక్టర్ సుభాష్ చంద్ర చెప్పాడు. ఎమోషనల్‌‌‌‌గా సాగే ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత అభినవ్ అన్నారు. నటులు రీణు, రాజ్ కుమార్ కసిరెడ్డి, సుదర్శన్, మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ సహా టీమ్ అంతా  పాల్గొన్నారు.