గోదారి గట్టుపైన..  అందరూ రిలేట్ చేసుకునే ప్రేమకథ

గోదారి గట్టుపైన..  అందరూ రిలేట్ చేసుకునే ప్రేమకథ

దాదాపు 80కి పైగా షార్ట్ ఫిల్మ్స్‌‌‌‌‌‌‌‌  తీసిన  సుభాష్ చంద్ర దర్శకుడిగా రూపొందించిన చిత్రం ‘గోదారి గట్టుపైన’. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, లైలా, రాజీవ్ కనకాల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.  రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అభినవ్ రావు నిర్మించారు. మే 8న సినిమా విడుదల  కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుభాష్ చంద్ర మాట్లాడుతూ  ‘ఇది సుమంత్‌‌‌‌‌‌‌‌కు పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌గా సరిపోయే కథ.  కథ చెప్పగానే  తనకు చాలా నచ్చింది.  గోదావరి అబ్బాయిగా అక్కడి యాసను పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌గా పలకడం కోసం చాలా ట్రైనింగ్ తీసుకున్నారు.  

ఈ కథ మన జీవితాల్లో చూసినదే.  ప్రతి ఇంట్లో తండ్రి కూతురు ఉంటారు, వారి మధ్య ప్రేమ ఉంటుంది. అలాగే ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ కూడా ఉంటుంది. ఈ రెండింటినీ ట్రయాంగిల్ ఫార్మ్‌‌‌‌‌‌‌‌లో చూపించాను.  అందరూ రిలేట్ చేసుకునేలా సినిమా ఉంటుంది. ఎన్ని తరాలు మారినా ప్రేమ ఎమోషన్ ఒకటే. 

ఈ కథను చాలా పరిణితితో ట్రీట్ చేశాం. జగపతిబాబు హీరోయిన్ తండ్రి పాత్రలో ఇన్‌‌‌‌‌‌‌‌స్పైర్ చేస్తారు.   లైలా గారు నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం.  ఇందులో జగపతిబాబు గారితో ఆమె కాంబినేషన్ కొత్తగా ఉంటుంది.  దాదాపు 20 ఏళ్ల తర్వాత లైలా గారు తెలుగులో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలకు మంచి బజ్ వచ్చింది. సంగీతం అందించిన నాగవంశీతో నాకు 12ఏళ్ల స్నేహం ఉంది.  నిర్మాత అభినవ్ గారు చాలా ప్రొఫెషనల్. ఎవరి పని వారు చేయాలనేది  ఆయన సిద్ధాంతం. మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు” అని చెప్పాడు.